ప్రజాశక్తి -కందుకూరు :గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం ఎస్‌సి కాలనీకి చెందిన టిడిపి కార్యకర్త జడ రాజు అనారోగ్యం కారణంగా గత 15 రోజుల నుంచి ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ్జ ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి రాజు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10వేల ఆర్థిక సాయాన్ని నాయకుల ద్వారా సోమవారం అందించే ఏర్పాటు చేశారు. రాజు కుటుంబ సభ్యులు నాగేశ్వరరావుకు కతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, కందుకూరు నియోజకవర్గ ఎస్‌సి సెల్ కార్యదర్శులు దువ్వూరి రమేష్ చంద్ర, గౌడపేరు అనిల్, గౌడపేరు ప్రసాద్ రావు, ఉలవపాడు మండల తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం నవీన్, జడ చిట్టిబాబు ఉన్నారు.










