Mar 07,2023 21:53

ఎన్నికైన కమిటీ సభ్యులతో పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి, తదితరులు

ప్రజాశక్తి -పెనుకొండ : బీసీ లకు గుర్తింపునిచ్చిన పార్టీ టీడీపీ నేనని తెలుగుదేశ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి , మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నాయకులు పూల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికారక జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు,పెనుకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బి.కె. పార్థసారధి ప్రకటించారు.ఈ కార్యక్రమానికి జిల్లా వాల్మీకి సాధికార అధ్యక్షులు రామాంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధులు గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ,రాష్ట్ర వాల్మీకి సాధికార కన్వీనర్‌ పూల నాగరాజు లు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నందమూరి తారకరామారావు టిడిపి పార్టీని స్థాపించారన్నారు. నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది బీసీ నాయకులు రాజ్యాధికారాన్ని అనుభవించారన్నారు. టిడిపి అంటేనే బిసిలు అని అన్నారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా,జడ్పీ చైర్మన్లుగా అవకాశం కల్పించారని తెలిపారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బీసీలకు ఉపయోగం లేని పదవులు ఇచ్చి ఉన్నతమైన పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని విమర్శించారు. టిడిపితోనే సాధ్యమని తెలిపారు. జిల్లాలో జరగనున్న నారా లోకేష్‌ యువ గళం పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా బోయ అనిల్‌ కుమార్‌, సానిపల్లి వెంకటేష్‌,సంగప్ప, నాగరాజు, చలపతి, శ్రీరాములు, శంకరప్ప, ఈశ్వరయ్య, కేశవయ్య, నరసింహప్ప, రాజేంద్రప్ప, రమేష్‌, నరసింహులు, నాగరాజు, నాగేంద్ర, రవీంద్ర, క్రిష్టప్ప, వెంకటేష్‌, నాగభూషణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగయ్య, చిన్నవెంకటరాముడు, కేశవయ్య, కురుబ కృష్ణమూర్తి, చిన్నప్పయ్య, బోయ నాగరాజు, లక్ష్మినారాయణ రెడ్డి, నరహరి, అదిశేషు, చంద్ర, టిడిపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.