రాయచోటి : బిసిలంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కషి చేయాలని పాల ఏకరి బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద నాయుడు తెలిపారు. మంగళవారం గుంటూరులోని మంగ ళగిరి టిడిపి కార్యాలయంలో బిసి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి అధ్యక్షత బిసి సెల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, బిసి ఫెడరేషన్ రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర హాజరైనట్లు తెలిపారు. సమావేశంలో బిసిలు రాజకీ యంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంపై చర్చించినట్లు పేర్కొ న్నారు. పార్లమెంటు పరిధిలోని ఆయా పార్లమెంట్ అధ్యక్షులు సాధికార సమితి కమిటీ సభ్యులందరూ కలిసి సభలు సమావేశాలు నిర్వహించి జగన్ చేసే అవినీతి అరాచకాలను ఎండగట్టాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బడుగు బలహీన వర్గాలపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. కక్ష సాధింపు ధోరణితో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బలాయిస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. అనంతరం తిరుమల వెంకన్న స్వామి ప్రసాదాలను కొల్లు రవీంద్ర, పట్టాభి రామ్‌కు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలయకరి కో- ఆర్డినేటర్ జీవన్ కుమార్ నాయుడు, పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర సాధికార కమిటీ కన్వీనర్లు, బిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు , సాధికార సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.










