ప్రజాశక్తి -కరప, జగ్గంపేట రూరల్ వైసిపిది దోపిడీ ప్రభుత్వమని, టిడిపి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ దోచుకోవడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటుతో వైసిపికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కరప మండలంలోని యండమూరులో 13వ రోజైన సోమవాకరం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్, గుల్లిపల్లి శ్రీనివాసరావు, బుంగా సింహాద్రి, జనసేన రాష్ట్ర కార్యదర్శి పొలసపల్లి సరోజ, పలివెల జానకి రామయ్య, పలివెల శ్రీరామచంద్ర, చీపురుపల్లి జయేంద్ర బాబు, మద్దూరి స్వామి, పేపకాయలు సత్తిబాబు, కోసూరి ఈశ్వరరావు, గంధం లక్ష్మీనారాయణ, బొజ్జ భవాని, దొమ్మేటి వెంకట రమణ, కొల్లుబోయిన అచ్యుత్, జనసేన నాయకులు గంజా దుర్గాప్రసాద్, సర్వసుద్ది లోవరాజు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్ మండలంలోని సీతా నగరంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మారిశెట్టి భద్రం ఆధ్వర్యంలో మహిళా శక్తి కమిటీ ఎస్‌విఎస్. అప్పలరాజు ఈ కార్యక్రమం గ్రామంలో మహిళలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ మహాశక్తి పధకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, తాతినేని నాగేశ్వరరావు, కాకర్ల కృష్ణాజీ, పోలినాటి ధర్మానందకుమారి, నకిరెడ్డి సూర్యవతి, గుమ్మల్ల అనంతలక్ష్మి, రాపాక లక్ష్మి పాల్గొన్నారు.