రాయచోటి టౌన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ దాతల సహకారంతో 140కు పైగా సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని, బ్రాహ్మణవీధిలోని కష్ణ హాస్పిటల్ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ ఉషారాణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేశ్వర రాజు దంపతుల ఆర్థిక సాయంతో టిబి యూనిట్ రోగులకు పౌష్టికాహారాన్ని అందించినట్లు తెలిపారు. 60మంది టిబి రోగులకు ఆరు నెలలకు వరకు సరి పడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అన్నారు. టిబి వ్యాధి గ్రస్తులకు పౌష్టి కాహారం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లయన్ సుందర్‌రాజ, నాయుడు, నందిని ట్రావెల్స్ వినోద్ కుమార్ నాయక్, భారతి స్కూల్ కరస్పాండెంట్ బసిరెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి లత, టిబి యూనిట్ సూప ర్వౖజర్ నాగేశ్వర్, ల్యాబ్ సూపర్వైజర్ గంగన్న, టిబి హెల్త్ విజిటర్ గంగాదేవి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.










