మాట్లాడుతున్న అధ్యాపకుడు
ప్రజాశక్తి-కందుకూరు :టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోజాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) దినోత్సవం సోమవారం ప జరిగింది.కళాశాలలో రెండు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు పనిచేస్తున్నాయి.కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్ , వైస్ ప్రిన్సిపల్ ఏడుకొండలు ,నరేంద్ర విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ సిహెచ్ శంకర్ రావు నరేష్ రాజా కార్యక్రమాలు ఆవశ్యకత గురించి వివరించారు. డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ కె. సుజాత ,షేక్ షహనాజ్ బేగం, కె కే పద్మావతి, జె.మైత్రి, కె.కరుణ కుమార్ తదితర అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు తమ సందేశాన్ని అందించారు. సామాజిక సేవ లో యువత యొక్క పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.










