తహశీల్దారుపై చర్యలు తీసుకోవాలని వినతి
ప్రజాశక్తి-సంగం : పెత్తందారులతో కలిసి యానాదులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంగం తహశీల్దారుపై చర్యలు తీసుకోవాలని, ఆయనపై ఎస్‌సి ఎస్‌టి కేసు నమోదు చేయాలని సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు యానాదుల సంక్షేమ సంఘం నాయకులు వినతి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంగం మండలం చెర్లో వంగల్లు ఎస్‌టి కాలనీలో యానాదుల ఇళ్ల మధ్య పెత్తందారుల పొలాలకు దారి ఇప్పించేందుకు తహశీల్దారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన యానాదులను ఇబ్బందులకు గురి చేస్తూ, కోళ్లను చంపేసి, ఇళ్లలోని నీరు బయటకు పోకుండా చేస్తున్నారన్నారు. రైతు తన పోలానికి దారి చూపాలని కోరినప్పుడు సర్వే చేయించి, రికార్డు ప్రకారం దారి ఉంటే చూపాలి, కానీ ఇందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఒకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు తిరివీధి సతీష్‌చంద్ర, కోశాధికారి యల్లంపల్లి రమేష్, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, యల్లపల్లి శీనయ్య పాల్గొన్నారు.










