తహశీల్దారు కార్యాలయంలో జెసి తనిఖీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగం, ఆత్మకూరు మండలాల్లో రైతులు తాము పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించడం లేదని వివరించగా వచ్చామన్నారు. అలాగే మండలంలోని డిసిపల్లి, సింగనపల్లి గ్రామాలలో భూ రీ సర్వే జరుగుతుండగా వాటి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి పలు సమస్యలపై వచ్చిన రైతులను సమస్యలను అడిగివెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కులం, ఆదాయం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయాల్లో చేసుకోవాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని అక్కడ పనులు జరగకపోతే తహశీల్దార్‌ను కలవాలని, అక్కడ పనులు కాకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయాలన్నారు. ఏళ్ల తరబడి అగ్రిమెంట్లు ఉన్నాయని ఓ రైతు జాయింట్ కలెక్టర్‌కు వివరించగా ఎన్నో ఏళ్లు గా ఉన్న చుక్కల భూమి సమస్య తొలగిపోయిందని, అగ్రిమెంట్లు సమస్య కూడా తొందరలోనే పరిష్కారం అవుతుందన్నారు. ఆయనవెంట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర, గ్రామ రెవెన్యూ అధికారులున్నారు.










