మాట్లాడుతున్న ఏపి జెన్కో జేఏసీ పరిరక్షణ కమిటీ కన్వీనర్
టెండర్లను రద్దు చేయాలి
నెల్లూరు :జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా , టెండర్లను రద్దు చేయాలని కోరుతూ భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని ఏపి జెన్కో జేఏసీ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏపీ జెన్కో జేఏసి పరిరక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సిఐటియుజిల్లా అధ్యక్షులుటీవీ వి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జెన్కోలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగి రవిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. మోహన్ రావు,సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు పి. యానాదయ్య ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కే. రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ ,పి ప్రసాద్ ,ఏపీ జెన్కో జేఏసీ నాయకులు సిహెచ్ ఆదిశేషయ్య, ఏ అనిల్, జి. భాస్కర్ ,సునీల్ ,కే .రవి, పి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










