Sep 25,2023 19:34

మాట్లాడుతున్న తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు

మాట్లాడుతున్న తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు
తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలు
ప్రజాశక్తి-నెల్లూరు:తిక్కన, నన్నయ్య, పోతన లాంటి మహానుభావులు అందించిన తెలుగు భాషా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు అధ్యక్ష్యులు పి. విజయబాబు, అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలలో అధికార భాషగా తెలుగు అమలు తీరుపై రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు అధ్యక్ష్యులు పి. విజయబాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఒక అపురూపమైన భాష తెలుగు భాష అని, తెలుగు భాష వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మనం జన్మించడం జరిగిందన్నారు. అమ్మ లాంటి తెలుగు భాషను ప్రతి ఒక్కరు విస్మరించరాదన్నారు. తెలుగు ప్రజలందరికి తెలుగు భాష పట్ల అభిమానం, గౌరవం ఉంటుందని, అయితే తెలుగు భాష అమలులో వెనుకబడి ఉన్నామని, అధికారులందరూ మాతభాషకు ప్రాధాన్యతను ఇస్తూ విధి నిర్వహణలో సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే చేయాలన్నారు. అప్పుడే వారికి న్యాయం చేకుర్చినట్లు అవుతుందని అయన తెలిపారు.
నేడు కంప్యూటరీకరణ నేపధ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పరిపాలనా వ్యవహారాల్లో తెలుగు భాష అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికినీ వాటిని అధికమించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు శ్రీ విజయ బాబు తెలిపారు. గతంలో ఎన్నడు లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పరిపూర్ణంగా అధికార భాష సంఘాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో భావి తరాల అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా అమలుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. నేడు నెల్లూరు నగరంలో చాలా వాణిజ్య భవనాలు, షాపుల వద్ద బోర్డుల్లో ఆంగ్లంలోనే పేర్లు వుండటం గమనించడం జరిగిందని, ద్వి భాషా అమలుగా వాణిజ్య భవనాలు, షాపుల వద్ద గల బోర్డుల్లో తొలుత తెలుగు లోను, తదుపరి ఆంగ్లంలో పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డా. డి. మస్తానమ్మ, డా. టి. వెంకటయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.