Mar 03,2023 21:19

తెలుగుగంగ స్థిరీకరణకు కసరత్తు

కడప ప్రతినిధి : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మసాగర్‌ స్థిరీకరణ కసరతుb0.2్త జోరందుకుంది. తెలుగుగంగ ఇంజినీరింగ్‌ యంత్రాంగం పెం డింగ్‌ పనులపై దృష్టి సారించింది. కుడి, ఎడమ కాల్వల్లోని పెండింగ్‌ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది. ఆర్నెళ్ల కింద కుడి, ఎడమ కాల్వల్లో పెం డింగ్‌ పనులకు రూ.28 కోట్లతో టెండర్లు పిలిచింది. రూ.6.3 కోట్లను భూ సేకరణకు కేటాయించింది. ప్రధానంగా ఎడమ కాల్వలో భాగమైన పోరు మామిళ్ల-బద్వేల్‌ కాల్వ పనులు పరుగులు పెడు తుండడం ఆశలు రేపుతోంది. జిబిసి, ఒబిసి కాల్వల పెండింగ్‌ పనులు దశాబ్దాలుగా వేధిస్తున్న సంగతి తెలిసి ందే. మొదటగా కుడి, ఎడమ కాల్వల్లోని పెండింగ్‌ పనుల బిట్లను గుర్తించింది. పెండింగ్‌ పనుల బిట్లను పూర్తి చేయడమే లక్ష్యంగా సాగుతోంది. జిబిసి, ఒబిసి కెనాల్‌ పనుల్ని సకాలంలో పూర్తి చేయగలిగితే 30 వేల ఎకరాలు ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. ఫలితంగా తెలుగుగంగ రిజర్వాయర్‌ కింద పూర్తి స్థాయిలో సాగు నీటిని అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిబిసి కింద 20 వేల ఎకరాలు, ఒబిసి కింద 10 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచు కునే అవకాశం ఉంది.బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ కింద సాగులో ఉన్న 96,500 ఎకరాల ఆయకట్టుకు అదనంగా కలవనున్న 30 వేల ఎకరాల ఆయకట్టు కారణంగా 1.30 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని 1.58 లక్షల ఆయకట్టు లక్ష్యాన్ని సుమారుగా అందుకునే దిశగా కదులుతోంది. 2024 డిసెంబర్‌ నాటికి బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ కాల్వల పెండింగ్‌ పనుల్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కదులుతున్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగంలో ఆసక్తి నెలకొంది.