తెలుగు తమ్ముళ్ల సంబరాలు
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కావలి పట్టణ ట్రంకు రోడ్డులోని నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్ల హర్షద్వానాల మధ్య సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలో జరిగిన తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అత్యధిక మెజారిటీ సాధించడంతో కావలి నియోజకవర్గ టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చి, భారీ కేకును కత్తిరించి, వచ్చిన వారందరికీ పంచిపెట్టారు. ముందుగా నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం అనే నినాదాలతో ట్రంకు రోడ్డులోని ఎఎంబేకరీ సెంటర్ మారు మ్రోగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్ బాబు, పోతుగంటి అలేఖ్య, జ్యోతి బాబురావు, ఆవుల రామకృష్ణ, బూచి రవియాదవ్, మొగిలి కల్లయ్య, ఉప్పుటూరు బాలగురుస్వామి, తటవర్తి వాసు, గొట్టిపాటి రాము, శానం హరి, తదితరులు పాల్గొన్నారు.










