Jan 19,2023 20:40

- వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి: సామాన్య ప్రజలకు అర్ధమయ్యే భాషలో పద్యాలు రాసి సాహిత్యాన్ని సమాజానికి చేరువ చేసిన ఘనత యోగి వేమనకు దక్కుతుందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. గురువారం విశ్వకవి యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవి యోగి వేమన తెలుగు సాహితీ రంగానికి అందించిన పద్యాలు గొప్ప సంపదన్నారు. వేమన పద్యాలు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే వాడుక భాషలో అద్భుతమైన కవిత్వం అందించి సామాజిక రుగ్మతలపై, సమాజ సంస్కరణకు కృషి చేసిన గొప్ప దార్శినికుడు వేమన అరని పేర్కొన్నారు. వేమన తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసి అరుదైన స్థానం పొందిన గొప్ప మహనీయుడుగా పేరు పొందారన్నారు. తెలుగు భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుందన్నారు. వేమన ప్రతి రంగాన్ని నిశితంగా పరిశీలించి అప్పటి సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై తనదైన శైలిలో నిర్భయంగా నిజాయితీగా వర్ణించారన్నారు. వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఎఒ బాలకృష్ణ, ఇరిగేషన్‌ ఎస్‌ఇ కృష్ణమూర్తి, కలెక్టరేట్‌ కో-ఆర్డినేషన్‌ విభాగపు సూపరింటెండెంట్‌ శ్రావణి, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. డిఇఒ కార్యాలయంలో.. యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఇఒ ఎద్దుల రాఘవరెడ్డి మాట్లాడుతూ యోగి వేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం వలన ఆ మహాకవికి సముచిత గౌరవం లభించిందన్నారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనదేనన్నారు. కులాన్ని నిరసించడమే కాకుండా సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ రమాదేవి, పిఆర్‌టియు రాష్ట్ర క్రమ శిక్షణా సంఘం చైర్మన్‌ కొండూరు శ్రీనివాసరాజు, సంబేపల్లి హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌రావు, నరసింహులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలికిరి: వేమన జయంతిని రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రాస్‌ రోడ్‌ బీడీ కాలనీ వద్ద రెడ్డి జెఎసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణరెడ్డి, గౌరవాధ్యక్షులు వై.ఆదినారాయణరెడ్డిల ఆధ్వర్యంలో వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు సహదేవరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకట నారాయణరెడ్డి, మోహనరెడ్డి, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ద్వారకనాథరెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు టి.రామచంద్రారెడ్డి, కోశాధికారి అంకిరెడ్డి, ఉపాధ్యక్షులు వి.సాంబశివారెడ్డి, సహాయ కార్యదర్శి కె.సుధాకర్‌రెడ్డి, న్యాయ సలహాదారులు ఎ.శివరాం రెడ్డి, వైవి.విశేష్షారెడ్డి, సమన్వయకర్త పి.రామమోహన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, టి.రాజారెడ్డి, డి.మల్‌రెడ్డి, ఆర్‌.శివకుమార్‌రెడ్డి, జె.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.