Dec 25,2022 17:23

సోమిరెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -పొదలకూరు :పట్టణానికి చెందిన మాజీ ఎంపిటిసి కొంగి.మస్తానమ్మ తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. తనను తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో తెలుగు మహిళ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నియమిం చడానికి చొరవ చూపిన మాజీ మంత్రి సోమిరెడ్డిని సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.