తెలుగు, గణిత సామర్థ్యాలు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : నల్లబల్లపై విద్యార్థుల తెలుగు, గణిత సామర్థ్యాలను మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ పరిశీలించారు. శనివారం మండల పరిధిలోని ఎంపిపిఎస్ కుర్రపల్లి పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా విద్యార్థుల పఠన అభ్యసన నైపుణ్య సామర్థ్యాలను పరిశీలించి నల్లబల్లపై విద్యార్థుల తెలుగు, గణిత సామర్థ్యాలను పరిశీలించి 4, 5వ తరగతి విద్యార్థులకు కూడడం, తీసివేయడం, పెంచడం, భాగించడం ఈ నాలుగు ప్రక్రియలు తప్పనిసరిగా వచ్చి ఉండాలని ఉపాధ్యాయులకు తెలిపారు. విద్యార్థులకు పరిసరాలను పరిచయం చేస్తూ బోధన చేయాలని సూచించారు. పాఠ్యపుస్తకాలలో ఉండే అభ్యాసాలే కాకుండా ఉపాధ్యాయులు తమ సొంతంగా అభ్యాసాలు తయారుచేసి ప్రతిరోజు విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వాలన్నారు. క్రమంతప్పకుండా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల వర్క్‌బుక్‌లను పూర్తి చేసే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎలీషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










