Sep 25,2023 19:42

మాట్లాడుతున్న తెలుగుభాషాభివృద్ది ప్రాథికార సంస్థ అధ్యక్షులు పి.విజరుబాబు

మాట్లాడుతున్న తెలుగుభాషాభివృద్ది ప్రాథికార సంస్థ అధ్యక్షులు పి.విజరుబాబు
తెలుగు భాషలో వ్యాపార, వాణిజ్య బోర్డులు
ప్రజాశక్తి-నెల్లూరు:వ్యాపార, వాణిజ్య భవనాలపై తెలుగు భాషలో బోర్డులు అమలు చేయని పక్షంలో రూ.10 వేల నుంచి రూ. 60 వేల వరకు అపరాధ రుసుం విధిస్తామని రాష్ట్ర అధికార భాషా సంఘం, తెలుగుభాషాభివృద్ది ప్రాథికార సంస్థ అధ్యక్షులు పి.విజరుబాబు పేర్కొన్నారు.సోమవారం నగరంలోని రహదారులు, భవనాల అతిధి గహంలో రాష్ట్ర అధికార భాషా సంఘం తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి. విజయబాబు, సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష అమలు తీరు, ఎంత శాతం అమలు అవుతుంది, అందులో ఎదురౌతున్న ఇబ్బందులు , తెలుగు భాష అమలుకు ఇంకా ఏమి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కంప్యూటరీకరణ తర్వాత తెలుగు భాష అమలులో సాంకేతికంగా వస్తున్న ఇబ్బందులు, సమస్యలను ఎలా అధికమించాలన్న దానిపై కూడా రాష్ట్ర అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ దష్టి సారించాయన్నారు. వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బోర్డులు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాతతరం వాణిజ్య భవనాల బోర్డులు తెలుగు భాషలోనే ఉన్నాయని, నేడు కార్పోరేట్‌ సంస్థలకు సంబంధించి బోర్డులు ఆంగ్లంలో వుండటం గుర్తించామన్నారు. కార్పోరేట్‌ సంస్థల వారికి అవగాహన కల్పించి తెలుగు భాషలోనే బోర్డులు ఉండేలా చర్యలు తీసుకునేలా కలెక్టర్‌కు సూచనలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా తెలుగు భాష, సంస్కతి పట్ల నిబద్దత వుండాలన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు భాషా అమలుకు విశేషంగా కషి చేయడంతో పాటు ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి తెలుగు భాష పట్ల మక్కువ లేదని కొందరు రాజకీయం చేస్తున్నారని, తెలుగు భాషావాదులు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం తెలుగు భాషాభివద్ది ప్రాధికార సంస్థ ద్వారా తెలుగు భాష అమలును మరింతగా విస్తతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మీడియా అకాడమీ పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. పాత్రికేయులు వ్యాసాలు , రచనలు, కవితలు, జర్నల్స్‌, రచించాలని, గ్రంధాలయ సంస్థల సహకారంతో వాటిని పుస్తకాల రూపంలో ప్రచురించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నార్ల వెంకటేశ్వరరావు, కాసినాధుని నాగేశ్వరరావు వంటి సుప్రసిద్దులైన జర్నలిష్టుల జీవిత చరిత్రను పుస్తకం రూపంలో ప్రచురించి ఈ సంవత్సరం నవంబర్‌ మాసంలో ఆవిష్కరించేలా మీడియా అకాడమీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 40, 50 సంవత్స రాల పాత్రికేయ వత్తిలో అనుభవం వున్న ప్రముఖ పాత్రికేయుల అనుభవాలను, అభిరుచులను పుస్తకం రూపంలో ప్రచురించేలా కషి చేస్తున్నట్లు, ఈ పుస్తకాలు భవిష్యత్‌ లో పాత్రికేయులకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. డిప్లొమా జర్నలిజం కోర్సు ఏర్పాటు చివరి దశకు వచ్చిందని తెలిపారు. మీడియా అన్నది కొన్ని ప్రామాణికాలను, విలువలను పాటిస్తూ, సమాజంలో, ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లును, మంచి చెడులను వార్తల రూపంలో ప్రచురించాలేగాని, ప్రజలను తప్పుదారి పట్టించాలన్న సంకల్ప ధోరణితో వార్తలను ప్రచురించరాదని ఈ సందర్భంగా అయన గుర్తుచేసారు. వ్యవస్థలను గాడిలో పెట్టేలా, ప్రజలకు వాస్తవాలు చేపడంలో పాత్రికేయులు తమవంతు కషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డాక్టర్‌ డి మస్తానమ్మ, డా టి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.