Sep 02,2023 23:31

ప్రజాశక్తి - గన్నవరం : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె చెన్నై నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.ఎల్‌.కె.రెడ్డి, ప్రోటోకాల్‌ ఎడి విజరు కుమార్‌ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో నీరుకొండ బయలుదేరి వెళ్లారు.