తెల్లపాడులో సంగ్రామయాత్ర
ప్రజాశక్తి-కలిగిరి : ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయకులు నందిపోగు వెంగళరావు మాదిగ ఆధ్వర్యంలో ప్రారంభమైన మాదిగల సంగ్రామ పాదయాత్ర మండలంలోని తెల్లపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరపై బిజెఇ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ప్రతిగ్రామంలో మాదిగలను చైతన్యం చేస్తూ ఏప్రిల్ 3న జరుగు బిజెపి జిల్లా కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్ట బద్దత కల్పిస్తామన్నారు. 2014ఎన్నికల మేనిఫెస్టో ద్వారా మాదిగలకు హామీనిచ్చిన బిజెపి నేటికీ 9సంవత్సరాలవుతున్నా తమ పార్టీ సిద్ధాంత కర్త దీన్‌దయల్ చెటోపాధ్యాయా భావజాలమైన అంత్యోదయ అనే అంశాన్ని గాలికి వదిలేసిందని వారు మండిపడ్డారు. అదేవిధంగా ఎంఎస్‌పి రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో 27, 28 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా జంతర్ మంతర్ వద్ద మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి మండల కన్వీనర్ రోడ్డా హాజరత్ మాదిగ, కో-కన్వీనర్ బొర్రా వెంగయ్య మాదిగ, ఎంఎస్‌ఎఫ్ నాయకులు ఐమూరి మోజెష్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ నాయకులు కూనిపోగు ఇర్మీయా, యద్దనపూడి రమణయ్య, మల్లెల తిరుమలేష్ మాదిగ, ఎంఎస్‌పి మహిళా నాయకురాళ్లు గేరా జానకి, మంద సుజాత, గంగపట్ల మురళి, బక్కా కృష్ణ మూర్తి, కర్రా సామియేలు, ఐమూరి సలోమాన్ రాజ్, గోసాల మధు, గోసాల మహేష్, కావురి రాఘవేంద్ర, మొద్దు మస్తాన్, గోచిపాతల ఆనంద్, గంగపట్ల నాగరాజు, కర్రా రాజు, నందిపోగు నవీన్, కొంజెటీ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.










