టెక్నీషియన్‌ను ఏర్పాటు చేయండి : సిపిఎం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు మున్సిపాలిటీ రక్షిత మంచినీటి పథకం నీటి శుద్ధి కేంద్రంలో టెక్నీషియన్‌ను నియమించి శుద్ధి చేసిన రక్షిత మంచి నీటిని పట్టణ ప్రజలకు అందించాలని ఆత్మకూరు సిపిఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నీటి సమస్యను కమిషనర్‌కు వివరిస్తూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ప్రతిష్టాత్మకంగా సోమశిల ప్రాజెక్ట్ నుండి ఆత్మకూరుకు పైపులైన్ ద్వారా ఆత్మకూరు కేంద్రంలో నీటిని శుద్ధి చేసి తగిన మోతాదులో క్లోరినేషన్ ప్రక్రియ చేసి పట్టణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలని సంకల్పంతో చేపట్టిన ఈ పథకంలో నీటి శుద్ధి కేంద్రంలో క్వాలిఫైడ్ శుద్ధి టెక్నీషియన్ లేకుండానే అన్‌స్కిల్ వర్కర్స్‌తో ఈ పని చేయించడం ప్రజల ఆరోగ్యానికి హానికరం నీటి శుద్ధి నిర్వహణలో జరిగే లోపాలతో తరచూ నీటి కలుషితంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పాలకవర్గం అధికారులు నీటి శుద్ధి కేంద్రంలో క్వాలిఫైడ్ టెక్నీషియన్ నియామకం విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరించడం చాలా బాధాకరం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్‌గా తమరు స్పందించి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని రక్షిత మంచి నీరును ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన నాగేశ్వరరావు సంబంధిత అధికారి ఏఈ ప్రసాద్‌తో మాట్లాడి టెక్నీషియన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సంధాని, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు నంద శీను, సిపిఎం నాయకులు రమణయ్య, జయకుమార్, పోలయ్య, నతానీ, శ్రీకాంత్, తదితరులున్నారు.










