ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు విజయనగరంలో వినీష్ తేక్వాండో అకాడమీలో తేక్వాండో పోటీల్లో రాజంపేట క్రీడాకారులు బ్లాక్‌బెల్ట్ సాధించారు. తేక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్ ప్రసాద్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ ఉత్తీర్ణత పరీక్షలు, జాతీయ రెఫరి సెమినార్, రిఫ్రెష్మెంట్ కోర్సును నిర్వహించారు. బ్లాక్ బెల్ట్ టెస్ట్‌లో రాజంపేటకు చెందిన సగినాల రిజ్వాన్, ధనకోటి జ్ఞానసాయి ఆచారి, కురుగుంట్ల మనోజ్ కుమార్ నాయుడు, షేక్ మొహమ్మద్ హనీఫ్ ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్‌కు ఉత్తీర్ణులైనట్లు రాజంపేట తేక్వాండో విక్షకుడు జాహిద్ అలి తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు గ్రాండ్ మాస్టర్ సగినాల పిచ్చయ్య వద్ద శిక్షణ పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎపి జనరల్ సెక్రెటరీ ఎల్.టి.చంద్రమౌళి, వైస్ ప్రెసిడెంట్ గురుస్వామి, జాతీయ తేక్వాండో మాజీ కోచ్ రామేశ్వర్ పాల్గొన్నారు.










