క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరు:ఎపి ఎన్‌జివో భవనంలో ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం 2023వ సంవత్సరం టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఎన్‌జివో భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా యన్ జీ ఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్నేపల్లి.పెంచలరావు,నాయుడు. వెంకటస్వామి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌జివో సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘంను బలోపేతం చేసుకోవాలని ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆంజనేయ వర్మ, కోశాధికారి బండారుపల్లి. వెంకటేశ్వర్లు,ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదిరాజు రామకష్ణ, వెంకటగిరి అధ్యక్షుడు గిరిబాబు,నాల్గవ తరగతి రాష్ట ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు జి. నాగేశ్వరరావు,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలపాటి. సందీప్ చక్రవర్తి,దేవరపల్లి.విధ్యాసాగర్,అసోసియేట్ అధ్యక్షులు ఆర్. భాస్కర్ రావు,ఉపాధ్యక్షులు యస్.మహేంద్ర, బి.శివకుమార్,ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్. ఖాజా మొహిద్దీన్,సంయుక్త కార్యదర్శులు డి.సల్మా ,కంటా నారయ్య, కోశాధికారి బి.జీవన్ కుమార్, నగర అధ్యక్షుడు యస్.రత్నయ్య,కార్యదర్శి షేక్. రఫీ, అసోసియేట్ అధ్యక్షుడు సీ హెచ్ యోగి, ఉపాధ్యక్షుడు ఆర్. నిరంజన్,సంయుక్త కార్యదర్శులు జి.రాజశేఖర్, కమలమ్మ,కోశాధికారి జి.వంశీ కష్ణ తదితరులు పాల్గొన్నారు.










