తడిసిన వరిధాన్యాన్ని చూపుతున్న రైతులు
తలుపుల : మండూస్ తుఫాను ప్రభావంతో తలుపుల మండలంలోని పలు గ్రామాల్లో పంటలు తడిసిపోయాయి. గుండువారిపల్లి పంచాయతీ ఎరిపల్లి గ్రామంలో 150 బస్తాలు వరిధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట కనుల ముందే నాశనం అవడంతో రైతులు రమణ, గురునాథ్, గంగన్న లబోదిబోమంటున్నారు. సంబంధించి అధికారులు స్పందించి గ్రామంలో పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.










