నివాళులర్పిస్తున్న నాయకులు
తారక రత్న మతి టిడిపికిి తీరని లోటు
నెల్లూరు:నందమూరి తారకరత్న మరణంతో ఒక యువ కిశోరాన్ని కోల్పోయామని, తారక రత్న మతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో నందమూరి తారకరత్న మతికి సంతాపంగా టిడిపి నేతలతో కలిసి తారక రత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తారకరత్నతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, 2019 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో తన గెలుపు కోసం ప్రచారం చేశారని గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు మనవడిగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదని, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ అన్నా, మామా, అంటూ ఆప్యాయంగా పిలిచేవారన్నారు. నందమూరి తారకరత్న భార్యాబిడ్డల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతుందని, అలాంటి కష్టం మెరవరికి ఏ కుటుంబానికి రాకూడదని కోరుకొంటున్నానన్నారు. గుండె పోటుకు గురై ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న తారకరత్న పూర్తిగా కోలుకోని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తారని భావించామని, 23 రోజులు ప్రాణాలతో పోరాడి మరణించడం బాధాకరమని, తారకరత్న కుటుంబానికి తన ఎప్పుడు రుణపడి ఉంటానని ఆయన మరణం పార్టీకి, సినిమా లోకానికి తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, సురేంద్ర బాబు, పెంచల్ నాయుడు, సాబీర్ ఖాన్, మైనుద్దిన్, కప్పిర శ్రీనివాసులు, భూలక్ష్మీ, అల్లాబక్షు, కోమరి విజయ, శ్రీదేవి, సుశీలమ్మ, రేవతి, ఆషిక్, ఇక్బాల్, అశ్లాం, సుబ్రహ్మణ్యం, ఆనంద్, వెంకట శేషు, ఉప్పు భాస్కర్, సికారి భాస్కర్, నారా శ్రీనివాసులు, చోటు, తదితరులు పాల్గొన్నారు.










