ప్రజాశక్తి-మండపేట
నిత్యం రద్దీగా ఉండే మండలంలోని మండపేట తాపేశ్వరం మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే రోడ్డులో తరచూ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుండడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. కొద్ది రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో తరచూ ఎదురెదురుగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని వాహనదారులు అంటున్నారు. భారీ వాహనాలతో రాకపోకలతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయలోనే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందన్నారు. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదని పలువురు వాపోతున్నారు.
ఎర్ర గ్రావెల్ తీసుకువెళ్లే లారీలు టిప్పర్లు కనీసం కంకరపై బరకం, టార్బల్ తప్పకపోవడంతో పడుతున్న గ్రావెల్, రోడ్డు నిర్మాణ పనులు నేపథ్యంలో లేస్తున్న దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.










