Feb 02,2023 21:54

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మండలంలోని చౌటుపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు గురువారం ఖాళీబిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం కొళాయిలు కూడా వేయలేదన్నారు. నీటికోసం ఐదుమైళ్ల దూరం వెళ్లాల్సివస్తోందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు లేనిపక్షంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.