తాగునీటి పరిష్కారమే లక్ష్యంవేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
రాయచోటి
జిల్లాలోని గ్రామ పంచాయతీలలో తాగునీటి సమస్య పరిష్కారమే తమ లక్ష్మమని జిల్లా పంచాయతీ అదికారి మిద్దింటి ధనలక్ష్మి పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు తమ పరిధిలోని అన్నిరంగాల్లో, తాగునీటి ఇతర సమస్యలలో ఎలా పరిష్కరించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె
వివరించారు.
రాబోవు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ ఆదేశాల మేరకు రాబోవు వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి ట్యాంక్‌లను ప్రతి 15 రోజులకు ఒక్క సారీ శుభ్రంచేసి క్లోరినేషన్ చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులను, సచివాలయ సిబ్బందిని ఆదేశిస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తమ పరిధిలోని తాగునీటి పైపులను పరిశీలించి లీకేజీలకు మరమ్మతులు చేపడుతున్నాం. చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
జగనన్న స్వచ్ఛ సంకల్పం వివరాలు తెలపండి?
ప్రతి సచివాలయ పరిధిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. పొడి, తడి చెత్త వేరు చేసే కార్యక్రమంచేపడుతున్నాం. గ్రామ పంచాయితీలో గ్రామ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం కూడా ఇస్తున్నాం. పంచాయతీల్లో చెత్త నుంచి తయారీ కేంద్రం కేంద్రాలను వాడకంలోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా 501 గ్రామ పంచాయతీలు, 4 లక్షల 19 గహాలున్నాయి .250 గహాలకు (1000 మందికి ) 1క్లాప్ మిత్రాలను నియమించాం. జిల్లాలో 1555 మంది క్లాప్ మిత్రాలున్నారు. 13510 మంది జనాభా ఉన్నారు.
పన్నుల వసూళ్లలో తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
ఆర్థిక సంవత్సరం ముగిస్తున్న తరుణంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 75 శాతం పన్నులు వసూలు చేశాం. మిగిలింది కూడా వంద శాతం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ఏకగ్రీవ గ్రామ పంచాయుతీలకు నిధుల పరిస్థితి ఏమిటి?
ఏకీగ్రీవ గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనవి. బి. కొత్తకోట మండలం గొల్లపల్లిలో గ్రామపంచాయతీలో రూ.10 లక్షలు ,పెద్దతిప్పా సముద్రం మండలంలో కట్నాగల్లు గ్రామంలో రూ.10 లక్షలు, మదుమూరు గ్రామంలో 5 లక్షలు , నవాబు కోట గ్రామంలో రూ. 10 లక్షలు, రంగసముద్రం గ్రామంలో రూ.10 లక్షలు, వాల్మీకిపురం మండలంలో నగిరి మడుగు రూ. 5 లక్షలు, మొత్తం రూ. 50 లక్షలు విడుదలైంది. ఎకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, విధులకు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
పంచాయతీల ఆర్థిక బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందించే గ్రాంట్లతోపాటు తమ పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ వనరులను గుర్తించాం. వాటిని గ్రామపంచాయతీల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పన్నులు వసూళ్లు, చేపల చెరువుల వేలం, పంచాయతీ దుకాణ సముదాయాల వేలం ద్వారా ఆర్థిక బలోపేతానికి వంద శాతం కషి చేస్తున్నామన్నారు.










