Jul 19,2021 11:40

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ స్నేహ.. తాను నటించిన సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆమెకు శ్రీరామదాసు చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇక తనకు పిల్లలు పుట్టకముందు వరుస సినిమాల్లో నటించినా.. తర్వాత పిల్లల బాధ్యతల రీత్యా కొంత విరామం తీసుకున్నారు. అయితే అంతకుముందులా వరుస సినిమాలు చేయకపోయినా ప్రాధాన్యమున్య పాత్రల్లో నటిస్తూ..ఆమె కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తెలుగులో ఆమె రామ్‌చరణ్‌ నటించిన వినయవిధేయ రామ చిత్రంలో చరణ్‌కు వదినగా నటించి మెప్పించారు. అయితే హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నా.. ఆమె చిన్న సూదిమందుకు భయపడ్డారు. ఇటీవల ఆమె వ్యాక్సిన్‌ మొదటి మోతాదు వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేసే సమయంలో సూదికి భయపడి.. టీకా వేసే నర్సుని కూడా నానా తంటాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె భర్త నటుడు ప్రసన్న వీడియో తీశారు. ఈ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సూదిమందుకు స్నేహ ఇంతభయపడుతుందా అని ఒకరు.. హమ్మయ్య ఎట్టకేలకు వ్యాక్సిన్‌ వేయించుకుంది అదే చాలు అని మరొకరు వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు భయపడిన వారిలో ఒక్క స్నేహా మాత్రమే కాదండోరు.. పాన్‌ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న ప్రశాంత్‌నీల్‌ కూడా ఉన్నారు.

స్నేహ భయపడుతున్న వీడియో మీరూ చూసేయండి.. https://www.instagram.com/reel/CRdXmfCnK3i/?utm_source=ig_web_copy_link