Oct 22,2022 15:33

ప్రజాశక్తి-వీరులపాడు : ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఉంటేనే రీచ్ ల నుండి ఇసుకను తోలుకోవాలని ఎస్ఈబిఎస్ఐ సివి కుమార్ తెలిపారు. వీరులపాడు మండలం దొడ్డ దేవరపాడు గ్రామ ఇసుక రీచ్ ను ఆయన తన సిబ్బందితో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రీచ్ లో సుమారు 70 ట్రాక్టర్ల వరకు లోడింగ్ నిమిత్తం రావడం చూసి ఇసుకతోలేందుకు అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. అయితే మండల పరిధిలో నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా స్కూల్స్ అభివృద్ధి కొరకు అనుమతులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు ఏస్ ఇబి అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అటువంటి అనుమతులు ఏమీ ఉన్నట్లు తమ దృష్టిలో లేవని ప్రస్తుతం లోడు నింపుకున్న ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుందని తదుపరి అనుమతులు వచ్చేంతవరకు ఇసుక రీచ్ లో ఎవరు ఎటువంటి తోలకాలు నిర్వహించరాదని ఎస్సీబీ ఎస్సై సివి కుమార్ తెలియజేశారు. అప్పటికే ఇసుక నింపుకున్న ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కాళీ ట్రాక్టర్లను ఇసుక రీచ్ నుంచి వెంటనే బయటికి వెళ్లాలని ఎఇబీ ఎస్ఐ సూచించారు. 

  • మండలంలో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక అధికారులు అనుమతులు మంజూరు 

శనివారం ఉదయం స్పెషల్ ఇంఫోర్స్మెంట్ బ్యూరో దొడ్డ దేవరపాడు గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని విషయం తెలుసుకొని దాడి చేశారు. అనుమతులు ఉన్నాయని తెలిసి టాక్టర్స్ యజమానులు ఇసుక పంపించామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేయడంతో లబోదివా అంటున్న ట్రాక్టర్ యజమానులు మండలంలో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మరియు జగనన్న గృహాలకు ఇసుక మంజూరు చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వ అధికారులకు ఒత్తిడి చేస్తున్నారు.