Sep 21,2023 10:02

ప్రజాశక్తి-విజయనగరం : 2వ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ యాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా నల్లిమర్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడారు. గురజాడ స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ఉద్యమాల చేపట్టాలని లోకనాధం పేర్కొన్నారు. గురజాడ 161వ వర్థంతి సందర్భంగా గురువారం నాడు గురజాడ అప్పారావు విగ్రహానికి సీపీఎం నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గురజాడ అప్పారావు స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న పాలకుల విధానాలును ప్రజలు ప్రతిగ టీoచాలని అందుకు ప్రజలకు అండ గా సీపీఎం పార్టీ ఉంటుందని ప్రజాహక్కులు పరిరక్షణకు సీపీఎంగా పూనుకుంటామని, గురజాడకు నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాధం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సర్యాన్నారాయణలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు సీపీఎం జిల్లా కమిటిసభ్యులు రామమోహన్,.రమణమ్మ, జగన్ సీఐటీయు నగర కార్యదర్శి రమణలు, జివిఎంసి యూనియన్ నాయకులు టి నూకరాజు, జె నాయుడు,  ఈ ఆదినారాయణ పాల్గొన్నారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని... తెలుగు ప్రజలు పోరాడి...32 మంది ప్రాణ త్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని...స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు

save-visakha-steel-plant-bike-rally-in-vzm11

 

savae-visakha-steel-plant-bike-rally-in-vzm22

 

savae-visakha-steel-plant-bike-rally-in-vzm3

 

savae-visakha-steel-plant-bike-rally-in-vzm3