Mar 21,2023 22:06

ఫొటో : మాట్లాడుతున్న కమిషనర్‌ రమేష్‌బాబు

స్వచ్ఛ అవార్డుకు దరఖాస్తులు
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ''ఉమెన్‌ ఐకాన్‌ లీడింగ్‌'' స్వచ్ఛత అవార్డుల ఎంపిక కోసం 24 తేదీ లోపు స్వచ్ఛతలో ప్రతిభ చూపిన మహిళలకు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ ఎం.రమేష్‌బాబు మంగళవారం స్థానికి మున్సిపల్‌ కార్యాలయంలో ప్రకటనలో తెలిపారు. పారిశుధ్య ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళలకు స్వచ్ఛత అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలియజేశారు. వ్యక్తిగా స్వయం సహాయక, చిన్నతరహ సామాజిక మరుగుదొడ్లు నిర్వహణ, సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రత, చెత్తలో సంపద తయారీ, పొడి చెత్తను వినూత్న రీతిలో వినియోగించడం, స్వచ్ఛతపై అవగాహన కల్పించడం మొదలైన విభాగాలో వీటిని అందచేస్తున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల మహిళలు 24 తేదీ లోపల ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న సచివాలయం వార్డు శానిటైజేషన్‌ సెక్రటరీ వారి దగ్గర దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి జూన్‌ 5 తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవార్డు అందజేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ తెలియజేశారు.