Jan 20,2023 21:41

ఫొటో : మాట్లాడుతున్న రైతు సంఘ నాయకులు కాకు వెంకటయ్య

స్వాధీన భూములు ఇప్పించాలని వినతి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన నిరుపేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను గ్రామస్తులకు కల్పించాలని తహశీల్దార్‌ సానా శ్రీనివాసులు రెడ్డికి రైతు సంఘ నాయకులు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిరుపేదలైన కృష్ణారెడ్డి పల్లి గ్రామస్తులు జీవనాధారంగా వర్షాధారమైన పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటివారికి వారి స్వాధీనంలో ఉన్న భూములను వారికి ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న భూ పంపిణీ గత ప్రభుత్వం లాగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి గ్రామంలో ఉన్న అర్హులను గుర్తించి భూ పంపిణీ చేయాలని జిల్లా ఉన్నతి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు.
ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఇతర రాజకీయ పార్టీలను జోక్యం చేయకుండా పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవంలో ఉన్న వారి భూములను వారికి కల్పించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ముఖ్యంగా కృష్ణారెడ్డిపల్లి నిరుపేద కుటుంబాల అనుభవంలో ఉన్న భూములను వారికి ఇవ్వకపోతే ఆ గ్రామస్తులు ఆత్మహత్యలు శరణ్యమంటున్నారని పూర్తిస్థాయిలో విచారణ చేసి వారి భూములను వారికి అప్పగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి కాకు విజయ, గ్రామస్తులు పాల్గొన్నారు.