వాల్మీకిపురం : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందించే సుస్థిర పాలన సిఎం జగన్‌తోనే సాధ్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతపర్తి ఆర్‌ఎస్ రోడ్డు, మదనపల్లి రోడ్డులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, వాటితో కలిగిన ప్రయోజనాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివలయ వ్యవస్థతో చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్ అహ్మద్, తహశీల్దార్ ఫిరోజ్ ఖాన్, ఇఒ పాండు, నాయకులు, వివిధశాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. పట్టణంలోని జెట్టిపాళ్యెంవీధిలో ఉపసర్పంచ్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణి చేసి, స్టిక్కర్లను అతికించారు. కార్యక్రమంలో ఎంపిటిసి రాజేష్, సచివాలయ కన్వీనర్ రాయుడు, నాయకులు ముబారక్, అషర్ పాల్గొన్నారు.










