Oct 19,2022 22:46

  • కలెక్టర్‌కు సిపిఎం నేతల వినతి

ప్రజాశక్తి - విజయవాడ : సూర్యలంక బీచ్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ బుధవారం ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు సిపిఎం నేతలు వినతిపత్రం అందజేశారు. విజయవాడ కలెక్టరేట్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్‌, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, నాయకులు సిహెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు కలెక్టర్‌ను కలిశారు. అజిత్‌సింగ్‌ నగర్‌, శాంతినగర్‌కు చెందిన పేద, దళిత, బలహీన వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని, నిర్మించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ పక్కా ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. త్వరగా ప్రభుత్వ సాయం అందేలా కషి చేయాలని కోరారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయని, ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఒకపక్క చదువుకుంటూ, మరోపక్క చిన్న చిన్న వత్తులు చేస్తూ కుటుంబాలను ఆదుకుంటున్న విద్యార్థుల మరణాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం మానవత్వంతో స్పందించి సాయం అందించాలని విన్నవించారు. ప్రతి ఒక్క కుటుంబానికి రూ.25 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించిన కలెక్టర్‌ను అభినందించారు. కలెక్టర్‌ డిల్లీరావు స్పందిస్తూ ఈ సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందించడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు.