ప్రజాశక్తి కదిరి అర్బన్ : సూర్య, చంద్ర ప్రభ వాహనంపై ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్య, చంద్ర ప్రభవాహనంపై స్వామివారి మూలవిరాట్‌ను ఊరేగించారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంలో, .రాత్రికి చంద్రప్రభ వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా శ్రీరామమూర్తి భార్య సుగుణమ్మ కీర్తన వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణములోని కళ్యాణ వేదికపై కళాకారులు పలు రూపాలలో నాటకాలు ప్రదర్శించారు. ఈ ఉత్సవాలలో పాలక మండలి చైర్మన్ జరిపిటి గోపాలకృష్ణ, ఆలయ కార్య నిర్వహణ అధికారి గురుప్రసాద్, కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సిఐ ్ తమ్మిశెట్టి మధు , నిరంజన్ రెడ్డి, సూర్యనారాయణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నేడు మోహిని అవతారం: బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం 10రోజు మోహినీ అవతారంలో ఖాద్రీశుడు దర్శనమివ్వనున్నారనిప్రధాన అర్చకులు నరసింహ రావు, కుమార్ స్వామీలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా కోట వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు వ్యవహరిస్తానని చెప్పారు.










