సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత అని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులో శుక్రవారం ఆత్మకూరు డిఎస్‌పి ఎన్.కోటారెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రతతో వాహనాల్లో ప్రయాణం చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమార్తె మేకపాటి అనన్యారెడ్డి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, మాజీ జెడ్‌పిటిసి డాక్టర్ ఆదిశేషయ్య, ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, షేక్ సర్దార్, సిండికేట్ పార్టనర్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, వైసిపి నాయకులు ఇందూరు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు చెరుకూరు కామాక్షయ్య నాయుడు, పొడమేకల పెంచలయ్య, ఎం.రాజశేఖర్, మహబూబ్ బాషా, వైసిపి నాయకులు కొండ వెంకటేశ్వర్లు, సయ్యద్ జమీర్, సిహెచ్ శ్రీనివాసులు నాయుడు, లక్ష్మీ రెడ్డి, బొమ్మిరెడ్డి రవి, సిఐలు నాగేశ్వరరావు, రవి నాయక్, ఎస్‌ఐలు శివ శంకర్‌రావు, సాయి ప్రసాద్, నరేష్ తదితరులున్నారు.










