ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకట గోపాల్ గౌడకు 2023 ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేశారు. పుట్టపర్తిలో మోటూరు హనుమంతరావు 22వ స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రధానోత్సవం సభలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు షామీర్, సత్య సాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్‌బాషా, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంతు. ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఇంతియాజ్ తదితరులు గోపాలగౌడను సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా దేశ ప్రజలకు న్యాయం అందిస్తూ రిటైర్డ్ తరువాత దేశంలో ప్రజాస్వామ్య లౌకిక గణతంత్రం సమైక్యత సమగ్రత చైతన్యానికి తోడ్పాటుకు శ్రమిస్తూ దేశ సేవ చేస్తున్నందుకు ఈ పురస్కారం అందజేస్తున్నామని ఉమర్ ఫారూక్ ఖాన్ అన్నారు.










