ఫొటో : సుధామయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాయకులు
సుధామయికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రజాశక్తి-బిట్రగుంట : కావలి ఉద్యానవన శాఖ అధికారి సుధామయి జన్మదినం సందర్భంగా కాండ్ర సతీష్ నాయుడు యువ నేస్తం ద్వారా వారి నివాసంలో గిరిజన జాగృతి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల వెంకటపతి, గ్లోబల్ విద్యా సంస్థ అధినేత సాధనాల దామోదర నాయుడు ఆదివారం కలసి పూలబుకే అందజేసి జన్మదిన శభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ సుధామయి ఉద్యానవన శాఖ అధికారిగా కావలి ప్రాంత రైతులకు పాడి పంటలు పండ్ల తోటలు ద్వారా రైతులు అభివృద్ధి చెందేలా అవగాహణ పెంపొందించి రైతులకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో సామాజిక నేత ఎం.మాలకొండారెడ్డి, గిరిజన నేత జేయం పూ.కనకయ్య, పీట్ల ప్రత్యూష్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.










