Jan 11,2023 20:40

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ జెడ్‌ శశికాంత్‌

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ జెడ్‌ శశికాంత్‌
ఆర్టికల్‌ కాంపిటీషన్‌లో సత్తా చాటిన
ఏసిఎస్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ జెడ్‌ శశికాంత్‌
నెల్లూరు:న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ హౌంశాఖ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌స్‌ యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌స్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆర్టికల్‌ కాంపిటీషన్‌లో విశేష ప్రతిభను కనపరిచిన ఫోరెన్సిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జెడ్‌ శశికాంత్‌కు, నగరానికి చెందిన ఏసి సుబ్బారెడ్డి మెడికల్‌ కళాశాలకు ప్రసంశలు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా 8 వేల ఆర్టికల్స్‌ పోటీ పడగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గాను 90 ఆర్టికల్స్‌ ఎంపికైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాటిలో నగరానికి చెందిన ఏసీ సుబ్బారెడ్డి మెడికల్‌ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జెడ్‌.శశికాంత్‌ పంపిన 1. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు ( చీఉ ఉచీజు జAచీ జుూజAూజు జీఖూు×జజు), 2. విదేశీయులు తమ పర్యటన నిమిత్తం వచ్చిన సమయంలో కేసుల్లో ఇరుక్కుంటే ఏఏ చట్టా
లు వారికి వర్తిస్తాయి. (×చీుజు=చీAు×ఉచీAూ ూAఔ ూ=ఉుఉజఉూూ ×చీ ూఉజూఉ డ వీజుణ×జఉూజు+Aూ జAూజుూ) అను 2 ఆర్టికల్స్‌ చోటు దక్కడం తో

జిల్లా గౌరవం మరింత పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2,3,4 తేదీలలో గాంధీనగర్‌, గుజరాత్‌ నందు దాదాపు వెయ్యి మంది దేశ, విదేశీ ప్రతినిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 25 వ జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ (ఏఐఎఫ్‌ఎస్‌సి), 2023 పురస్కరించుకుని నిర్వహించిన ఆర్టికల్‌ పోటీల్లో నగరానికి చెందిన ప్రభుత్వ వైద్యకళాశాలకు చోటు దక్కడం సంతోషకరం. దేశ వ్యాప్తంగా నిర్వహించిన కాంపిటీషన్‌ లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్‌ కళాశాల కు అరుదైన ఘనత దక్కడం తో ఫోరెన్సిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జెడ్‌.శశికాంత్‌ కు పలువురు అభినందనలు తెలిపారు.