మృతిచెందిన శీనయ్య
స్తంభాన్ని ఢకొీని మోటార్ సైక్లిస్ట్ మతి
కొడవలూరు :స్తంభాన్ని ఢకొీని మోటార్ సైక్లిస్ట్ మతి చెందారు. ఈ సంఘటన కొడవలూరు మూలకట్ట సంఘం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుండాలమ్మపాలెం గాంధీ గిరిజన సంఘంకు చెందిన తలపల శీనయ్య(48) మోటార్ సైకిల్ పై శుక్రవారం రాత్రి విడవలూరులో సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా చూసుకొని తిరిగి ఇంటికి వస్తూ కొడవలూరు మూలకట్ట సంఘం వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢకొీన్నాడు. అప్పటికే సమయం రాత్రి పన్నెండు గంటలు దాటడంతో స్తంభాన్ని ఢకొీని తీవ్ర గాయాలతో పడి ఉన్న శీనయ్యను గంట దాకా ఎవరూ గుర్తించలేదు. అర్థరాత్రి అల్లూరు వైపు వెళుతున్న వారు రోడ్డు పక్కన పడి ఉన్న శీనయ్యను గమమనించి 108 కి సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో మత్యువుతో పోరాడుతున్న శీనయ్యను 108 సిబ్బంది నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా, రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో మతి చెందారు. మతుని భార్య తలపల వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.సుబ్బారావు తెలిపారు.
ఫొటోరైటప్స్










