ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులు ఉర్ధూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపొందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ డిఎన్ ఇంద్రజ అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్‌పర్సన్ చాంబర్‌లో స్టడీ మెటీరియల్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు మీడియంలో స్టడీ మెటీరియల్ పట్టణంలో లభిస్తాయన్నారు. అయితే ఉర్దు మెటీరియల్ దొరకడం లేదన్నారు. దీనిని గుర్తించిన ఉర్దు ఉపాధ్యాయులు స్టడీ మెటీరియల్ సిద్దం చేసి, విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీమన్నారు. ఈ మెటీరియల్ ద్వారా బాగా చదువుకుని, 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ జబివుల్లా, మున్సిపల్ ఉర్ధూ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, ఉపాధ్యాయులు ఐనుద్దీన్, హరి, దర్గా ఇమ్రాన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.










