జిల్లాలో స్టాఫ్‌నర్సు పోస్టుల రిక్రూట్‌మెంట్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపి శాక్స్) నోటిఫికేషన్ కింద ఎఆర్‌టి, ఇతర మాధ్యమంలో యుపిహెచ్‌సి విభాగాల కింద వేర్వేరుగా చేపట్టిన 25 స్టాఫ్‌నర్సుల నియామకాలపై గందరగోళం చోటుచేసుకుంది. ఒకే నోటిఫికేషన్, ఒకే రోస్టర్ కింద రెండు విభాగాల పరిధిలోని స్టాఫ్‌నర్సుల పోస్టులను ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇడబ్య్లుఎస్ రిజర్వేషన్ వర్తించని నోటిఫికేషన్‌కు వచ్చిన వందలాది దరఖాస్తులను ఒకే రోస్టర్ మెరిట్ ఆధారంగా యుపిహెచ్‌సి స్టాఫ్‌నర్సు పోస్టులను ఎలా భర్తీ చేస్తారని, వాటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలనే వాదన పెద్దఎత్తున వినిపిస్తోంది.
కడప ప్రతినిధి
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపి శాక్స్) నోటిఫికేషన్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం ఆద ేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఎపిశాక్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ.21 వేల వేతనంతో ఐదు ఎఆర్‌టి (ఆంటీ రిట్రోవైరల్ థెరఫీ) స్టాఫ్‌నర్సుల పోస్టులకు 270 స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇడబ్ల్యుస్ రిజర్వేషన్ వర్తించదని నోటిఫికేషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. నవంబర్ 12న డిఎంహెచ్‌ఒ, అడిషనల్ డిఎంహెచ్‌ఒలతో కూడిన రిక్రూట్‌మెంట్ కమిటీ ఐదు స్టాఫ్‌నర్స్, ఆరు ల్యాబ్ టెక్నీషియన్స్, నలుగురు కౌన్సిలర్లు, ఒక్కొక్కరు చొప్పున ఫార్మ సిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులోని ఐదుగురు స్టాఫ్‌నర్సుల పోస్టులకు ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారు. మిగిలిన రెండు పోస్టుల భర్తీ నిమిత్తం మరోసారి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొదటి, రెండవ దఫా నోటిఫికేషన్ కింద రిక్రూటైన ఐదుగురు ఎఆర్‌టి స్టాఫ్‌నర్సులను ఉమ్మడి కడప జిల్లాలోని రిమ్స్, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, పులివెందుల ఎఆర్‌టి సెంటర్లలో నియమించారు. అర్బన్ ఫ్రైమరీ హెల్త్ సెంటర్స్ (యుపిహెచ్‌సి) కింద 20 మంది స్టాఫ్ నర్సులను నియమించాలని ఆదేశాలు అందడంతో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వచ్చింది. జిల్లా వైద్యఆరోగ్య శాఖ రెండవ కేటగిరీ కింద యుపిహెచ్‌సి స్టాఫ్‌నర్సుల రిక్రూట్‌మెంట్ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయాల్సిన నేపథ్యంలో డిసెంబర్ 16న గుర్తు తెలియని మీడియా మాద్యమంలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు సమాచారం. యుపిహెచ్‌సి నోటిఫికేషన్ సమాచారం తెలియకపోవడంతో నిరుద్యోగులకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న రిక్రూట్‌మెంట్ కమిటీ ఇడబ్య్లుఎస్ రిజర్వేషన్ వర్తించని ఎపిశాక్స్ నోటిఫికేషన్ కింద వచ్చిన 270 పైగా దరఖాస్తుల్లో ఎఆర్‌టి కేటగిరీ కింద భర్తీ చేసిన ఐదు పోస్టులు దక్కించుకున్న దరఖాస్తులను మినహాయించి మిగిలిన దరఖాస్తులతో రిక్రూట్‌మెంట్ కథ నడిపించారనే విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. యుపిహెచ్‌సి కేటగిరీ కింద రూ.24 వేల వేతన ప్రాతిపదికన 20 స్టాఫ్‌నర్సుల పోస్టుల ఎంపిక అత్యవసరమైతే గతంలో యుపిహెచ్‌సి కింద సీనియారిటీ జాబితా ప్రకారమైనా చేయాలి. లేనిపక్షంలో ప్రస్తుత పోటీ వాతావరణంలో అందరికీ తెలిసేలా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి స్టాఫ్‌నర్సు పోస్టులను రిక్రూట్‌మెంట్ చేయాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి విధానాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి ఇడబ్య్లుఎస్ వర్తించని ఎపి శాక్స్ నోటిఫికేషన్ దరఖాస్తుల ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేయడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇడబ్య్లుఎస్ రిజర్వేషన్ వివరాలు ప్రకటించని కారణంగా తాము ఉద్యోగావకాశాన్ని కోల్పోయామని పలువురు వాపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర ప్రాతిపదినకన స్టాఫ్‌నర్సు పోస్టులను రిక్రూట్‌మెంట్ చేయాల్సి వస్తే యుపిహెచ్‌సి పాత రోస్టర్ మెరిట్ జాబితా ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేయాల్సి ఉందని, గుర్తుతెలియని మీడియా మాద్యమంలో నోటిఫికేషన్ విడుదల చేసి గుట్టు చప్పుడు గాకుండా ఎపిశాక్స్ నోటిఫికేషన్ దరఖాస్తుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన అర్బన్ సెంటర్స్ స్టాఫ్‌నర్సులను ఎంపిక చేయ డంలోని మతలబేమటో తేల్చాలని, వివాదాస్పద రిక్రూట్‌మెంట్ కమిటీ సభ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డిఎంహెచ్‌ఒను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.










