Jan 04,2023 15:15
  • సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి
  • పారిశుధ్యంలో రాజీ పడే ప్రసక్తే లేదు
  • పంచాయతీ అభివృద్ధి పరిశుభ్రత నా ధ్యేయం
  • ఇంటితో పాటు పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత

ప్రజాశక్తి - పుల్లంపేట(అన్నమయ్య) : పుల్లంపేట పంచాయతీ పరిధిలోని ఉడుము వారి పల్లె గ్రామం మరియు అరుంధతివాడ హరిజనవాడ గ్రామాల నందు బుధవారం నాడు స్థానిక సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు చెత్తను తొలగించడం వీధులలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆ తొలగించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా ఊరి బయటకు తరలించడం జరిగింది. శీతాకాలం దశ కావడం చేత నెమ్ము వాతావరణ పరిస్థితులు ఉండడం వలన ఈగలు, దోమలు అధికమై వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందువలన ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతోందని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నిర్మించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పారిశుద్ధ్యం పైన ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించగలుగుతారని అన్నారు. ఇంటి ముందు మురుగు, నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పల్లెలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అలాగే పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని తెలియజేశారు. పీల్చే గాలి తినే తిండిత్రాగునీరు శుభ్రంగా ఉంటే ఏ రోగాలు దరిచేరవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తురక భాస్కర్ రెడ్డి మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.