Mar 17,2023 22:22

భవన నిర్మాణ పనుల్లో సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, పెనుగొండ రమేష్‌, సిఐటియు బాబావలి తదితరులు భవన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. బేశిరెడ్డి నాగమ్మ పేరుతో నిర్మిస్తున్న ఈ భవనానికి ఎంతోమంది కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు మానవతావాదులు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. ఇది కేవలం ఉద్యోగ కార్మిక కర్షకులకే కాకుండా పేద ప్రజలకు కూడా ఉపాధి కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ భవన నిర్మాణ పనులు ఇప్పుడే ప్రారంభమైందని ఇందుకోసం ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని వారు కోరారు. పార్టీ అభిమానులు, కార్మికులు రైతులు సహకరించి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.