రాయచోటి : రీ సర్వే ప్రక్రియలో భాగంగా సర్వే రాళ్లు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ, గహ నిర్మాణాల స్టేజి కన్వర్షన్ ఉండేలా వేగవంతం చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్‌లను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అర్జీలను సకాలంలో నాణ్యతగా అర్జీదారుల సంతప్తి మేరకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులు జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. తప్పనిసరిగా బియాండ్ ఎస్‌ఎల్‌ఎకు వెల్లకుండ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేసేలా వివిధ స్టేజిలో ఉన్న వాటిని పూర్తి చేసే దిశగా వేగవంతం చేయాలన్నారు. స్టేజి వారీగా పురోగతి ఉండాలని ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జగనన్న భూహక్కు - భూ రక్ష రీసర్వేలో రెండవ ఫేజ్ గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, వెక్టరైజేషన్ డిఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు. మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. పలు అంశాలపై అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు










