సర్పంచ్‌ని పరామర్శిస్తున్న ఎంఎల్‌ఎ
. ప్రజాశక్తి-కందుకూరు :కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు ను గురువారం ఎంఎల్‌ఎ మాను గుంట మహీధర్‌రెడ్డి పరామర్శించారు. ఈనెల 7వ తేదీన సర్పంచ్ మాధవరావు తండ్రి మరణించారు. దీంతో ఎంఎల్‌ఎ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, ధైర్యంగా ఉండాలని, మనో నిబ్బరంతో ముందుకు సాగాలని సూచించారు. ఎంఎల్‌ఎ వెంట వైసిపి నాయకులు కొండూరి వసంతరావు, పబ్బిశెట్టి శివ ఉన్నారు.










