Mar 25,2023 20:50

ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యం

ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యం
శ్రీవెంకటేశ్వరలో ఉద్యోగాల నియామకం
కొడవలూరు:శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కొడవలూరు నార్త్‌ రాజుపాలెంలో ఉద్యోగ నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. మైగో కన్సల్టింగ్‌ నెల్లూరు వారు ఫైనల్‌ ఇయర్‌ బిటెక్‌ సి ఎస్‌ సి, ఈసీఈ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గ్లోబల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యమన్‌ రిసోర్సెస్‌ అధికారి కావ్య కొమ్మన హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రితీష్‌ వాయర్‌ ఆధ్వర్యంలో మొదట రాత పరీక్షలు గ్రూప్‌ డిస్‌ కషన్‌,ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హత సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలను కాలేజ్‌ మేనేజ్మెంట్‌ చైర్మన్‌ డాక్టర్‌ పెనుబల్లి బాబు నాయుడు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పి.కష్ణ చైతన్య ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి కుమార్‌ బాబు ఆధ్వర్యంలో అందజేశారు.