Jan 16,2023 22:14

పార్వేటోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన ప్రజలు

కదిరి అర్బన్‌ : ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనుమ రోజు నిర్వహించు శ్రీవారి పార్వేటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి శ్రీవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి కదిరి కొండ కింద ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వేటోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణ సిఐ మధు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జరిపిటి గోపాలకృష్ణ, కార్యనిర్వాహణాధికారి పట్టెం గురుప్రసాద్‌, ప్రధాన అర్చకులు, సర్పంచి మణికంఠ నాయక్‌, ఆలయ కమిటీ సభ్యులు వేణు, రవీంద్రారెడ్డి, గంగాధర, గోపాల్‌ రెడ్డి, రమేష్‌ నాయక్‌, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.