రాజంపేట అర్బన్ : పట్టణంలోని నూనెవారిపల్లె రోడ్డులోని శ్రీ సాయి విద్యాలయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలకు విద్యా శాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. ఆ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని సోమవారం ఆర్‌డిఒకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లా డుతూ శ్రీ సాయి విద్యాలయ పాఠశాల యాజమాన్యం విద్యా శాఖ నిబంధ నలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూన్నారన్నారు. పలు మార్లు విద్యాశాఖధికారులకు ఫిర్యాదు చేసినా వారికే వాత్తసు పలుకు తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకపోయినప్పటికీ ఒకే పేరుతో రెండు క్యాంపస్లు నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. శ్రీ సాయి విద్యాలయలో ప్రధానంగా నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణ మొత్తం చూస్తున్నారని, వారి పైన తక్షణమే కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు అడ్మిన్‌కు వచ్చే విద్యార్థి చేత నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారని, కేవలం నర్సరీకే రూ.30 వేలు నుండి రూ.40 వేల వరకు తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పలు ప్రయివేట్ పాఠశాలలు సిబిఎస్‌ఇ, జెఇఇ మేయిన్స్, ఐఐటి, బోధించే అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోయినపప్పటికీ ఉన్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నారని, గుర్తింపు లేని పాఠశాల వివరాలు విద్యాశాఖ అధికారులు పత్రికలకు తెలియచేయాలన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ సాయి విద్యాలయ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని మిగిలిన కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్, రాజంపేట ఉపాధ్యక్షులు సుభాన్, గురుప్రసాద్, సాయి, శివకుమార్ పాల్గొన్నారు. ఆర్‌డిఒకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు










