Jul 10,2021 08:52

నిజామాబాద్‌ : ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కు వరద ఉధృతి పెరుగుతుంది. భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టులో నీటిమట్టం 20,402 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1072.20 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90 టిఎంసి లు కాగా, ప్రస్తుతం 33.550 టిఎంసి లకు చేరింది.