Apr 24,2023 21:20

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మదనపల్లె అర్బన్‌ : శ్రీకృష్ణ దేవరాయలు అందరివాడని, గొప్ప పరిపాలన దక్షత కలిగిన చక్రవర్తిగా సంగీత, సాహిత్యాలను విస్తతంగా ప్రోత్సాహించాడని భూగర్భ వనరులు, విద్యుత్‌, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మదనపల్లె బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణ నడిబొడ్డున మల్లికార్జున సర్కిల్‌ వద్ద శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు మహా చక్రవర్తి అని, అన్ని కులాల వారికి సమ న్యాయం చేశాడని తన వద్ద వున్న 8 మంది కవులు ఒక్కొక్క కులానికి చెందిన వారని వివరించారు. ఎన్నో ఏళ్ల గడచినా ఆయన ఖ్యాతి దశ, దిశల నిలిచిపోయిందన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు చూపిన బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతి సంక్షేమ పధకం ప్రతి ఒక్కరికీ అదేవిధంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. రాజంపేట ఎంపీి మిధున్‌రెడ్డి మాట్లాడుతూ బలిజ సేవా సమితి చేసే కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని వాటిలో తమను కూడా భాగస్వామ్యులు చేయాలని కోరారు. మరో వెయ్యి సంవత్సరాలైన శ్రీకృష్ణ దేవరాయలు అందరి హదయాల్లో నిలిచిపోతారని అన్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి స్థలం కోరిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభ వేదికపైనే ఆర్‌డిఒను పిలిచి కేటాయించాల్సిందిగా ఆదేశించడంపై బలిజ సేవా సమితి అధ్యక్షులు బిపిఎల్‌ విజరుకుమార్‌, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నవాజ్‌ బాష, టిటిడి బోర్డు మెంబర్‌ పోకల అశోక్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింక వెంకట చలపతి ప్రసంగించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్మన్‌ మానోజారెడ్డి, వైస్‌ చైర్మన్‌ జింకా వెంకట చలపతి, బోయకొండ గంగమ్మ దేవస్థాన ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, బలిజ సేవా సమితి ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, తోట మదనేశ్వర్‌, భాను ప్రకాష్‌, మోహన్‌, సూర్యనారాయణ, రాజ్‌భవన్‌ రాజా, శ్రీనివాసులు, వేణుగోపాల్‌, జంగాల శివరామ్‌ రాయల్‌, శ్రీనివాసులు, రామాంజులు, శశికాంత్‌, శ్రీనివాసులు, జయచంద్ర, రగు రాయల్‌ పాల్గొన్నారు.
- శ్రీకృష్ణ దేవాదాయల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి